ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

29-09-2026 | 07:13am

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరిన్ని వార్తలు