ఆ స్ఫూర్తి తరగని ఆస్తి
ఆయన పేరు పలికితే రోమాలు నిక్కబొడుస్తాయి.. ఆ పోరాటాన్ని తలచుకుంటే స్ఫూర్తిపతాక రెపరెపలాడుతుంది! తెల్లదొరల నిరంకుశ పాల నను అంతం చేయడానికి అగ్నిజ్వాలలా మారిన యోధుడు అతడు! ఆయనే.. భగత్ సింగ్!! ఇది కేవలం ఓ వ్యక్తి పేరు కాదు.. దేశ చైతన్యాన్ని మేల్కొల్పే మహత్తర శక్తి. ‘నా ధ్యాస, నా శ్వాస, నా సర్వస్వం.. నా దేశం! ఈ గడ్డపై పుట్టినా, ఈ మట్టిలో కలిసిపోయినా అది నా దేశ విముక్తి కోస మే కావాలి’ అంటూ నినదించిన మహోన్నత త్యాగమూర్తి ఆయన.
‘జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణా న్ని ప్రేమిస్తాం.. మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరి కంబాన్ని ఎగతాళి చేస్తాం.. నిప్పురవ్వల మీద నిదురిస్తాం’ అని మృ త్యువుకు సవాల్ విసిరాడు భగత్ సింగ్. ‘నన్ను మీరు చంపగలరేమో.. కానీ, నా ఆశయాన్ని చంపలేరు. నా దేహం నుంచి చిందే ప్రతి రక్తపు చు క్క ఏరులై ప్రవహించి, ఈ దేశ మ ట్టిని తడపాలి. ఆ రక్తపు వాసన ప్రతి భారతీయుడిలో స్వదేశీ చైతన్యమై తెల్లదొరల పాలనకు చరమగీతం పాడా లి’ అంటూ బ్రిటిష్ సామ్రాజ్యవాద పునాదులను ఆయన కుదిపేశాడు.
దేశం కోసం జీవితం అంకితం
1907 సెప్టెంబర్ 27న కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. చిన్ననాటి నుంచే దేశభక్తిని తన నరనరాల్లో నింపుకున్నాడు. పసితనంలోనే ‘నేను తుపాకి మొక్కలు నాటుతున్నాను నాన్నా! ఇవి పెరిగి పెద్దవై వేల తుపాకులుగా వికసించాలి. ఆ ఆయుధాలను నా దేశ ప్రజలకు పంచి, ఈ తెల్లదొరల గుండెల్లో నిద్రపోతా’ అని ఎలుగెత్తి చాటిన విప్లవ అగ్గిరవ్వ భగత్ సింగ్. 12 ఏండ్ల వయసులోనే జలియన్‌వాలాబాగ్ దారుణాలను చూసి రగిలిపోయాడు. 14 ఏండ్లకే స్వాతంత్య్రో ద్యమంలో అడుగుపెట్టాడు. స్వాతంత్య్రం యాచిస్తే రాదని, పోరాడితేనే సాధ్యమన్నాడు. కుటుంబ సభ్యులు పెండ్లి చేసేందుకు ప్రయత్నించగా.. ‘నా జీవితాన్ని మాతృదేశ విముక్తి అనే ఉన్నతాశయానికి అంకితం చేశాను’ అంటూ తం డ్రికి ఉత్తరం రాసి ఇంటిని విడిచాడు భగత్ సింగ్.
ఇంక్విలాబ్ జిందాబాద్
1927లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా లాలా లజపతిరాయ్‌పై జరిగిన లాఠీచార్జ్ ఆయన మరణానికి దారితీసింది. దీనికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను భగత్‌సింగ్, రాజ్‌గురు హత్య చేశారు. 1929లో పార్లమెంట్‌లో బటుకేశ్వర్ దత్‌తో కలిసి బాంబులు విసి రి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలతో మార్మోగించారు. తప్పించుకునే అవకాశం ఉన్నా, ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ చైతన్యం రగిలించాలనే ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయాడు. 1931 మార్చి 23న లాహోర్ జైలు లో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురుకు బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష అమలు చేశారు. మార్చి 23ను ‘షహీద్ దివస్’గా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
యువతరం మేల్కొనాలి
భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి తరం మేల్కొనాలి. కుల-మత అడ్డుగోడలను కూల్చేందుకు ముందుకు రావాలి. ఉపాధి అవకాశాల కోసం, సమానత్వ సమాజ నిర్మాణం కోసం పోరాడాలి. ప్రజా సమస్యలపై చైత న్యంతో నిలబడాలి.
ప్రశ్నించడమే విప్లవం
అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు మౌనం కాదు ప్రశ్నిం చడమే విప్లవం. భగత్‌సింగ్ పో రాట స్ఫూర్తి తరతరాలకు తరగని ఆస్తి.
వ్యాసకర్త: జర్నలిస్టు, రచయిత, 9848772232