కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం
నిర్మల్ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మంత్రి కొండ సురేఖ(Konda Surekha)ను కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవీని నర్సాపూర్ రాష్ట్ర నాయకులు అనుముల భాస్కర్(Anumula Bhaskar) తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని బీసీ ఎజెండా అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి నేటి వరకు బిసి ఎజెండను అమలు చేయకపోగా అగ్రకుల కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీగా మారి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులపై బర్తరఫ్ చేయడం కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలకు ఒక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మరో న్యాయంగా చేయడం అంటే అగ్రకులాహంకారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని ఎన్ని మాటలు అన్న, జగ్గారెడ్డి ఎన్ని తిట్లు తిట్టిన పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండ సురేఖ కూతురు ఏదో మాట్లాడిందని కొండ సురేఖను బాధ్యులుగా చేస్తూ భర్తరఫ్ చేశారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ మాటలకూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని ఎందుకు బర్తరఫ్ చేయలేదు అన్నారు. అగ్రకులాలకు ఒక్క న్యాయం బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం ఇది సరైన పద్ధతి కాదని భవిష్యత్తులో బీసీలను అనేసి వేసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోతుందని దీనిని కాంగ్రెస్ పార్టీలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులు గ్రహించి కొండ సురేఖ బర్తరఫ్ ను తీవ్రంగా ఖండించాలని పిలుపునిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓట్లతో గెలిచిన అగ్రకుల కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజల పైన ప్రజా ప్రతినిధుల పైన నియంతృత్వ ధోరణి సరైంది కాదన్నారు. భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదాన్నారు కొండ సురేఖ మంత్రి పదవిని వెంటనే పునరుద్ధరించి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.






