రేపే మహానిమజ్జనం
- గణేషుడి శోభాయాత్రకు సర్వం సిద్ధం
- ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- విధుల్లో 20 వేల మంది పోలీసులు
- నిమజ్జనంపై ప్రత్యేక నిఘా.. షీ టీమ్స్ పహారా
- డీజేలు బందు, అతిక్రమిస్తే కఠిన చర్యలు
- హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు ముగింపు(Conclusion of Vinayaka Chavithi celebrations) దశకు చేరుకున్నాయి. ఈ నెల 25 (శుక్రవారం) ఉదయం నుంచే నగర వ్యాప్తంగా వినాయక మహానిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు మొదలుకొని నగరంలోని వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్(Idols at Hussain Sagar)తో పాటు వివిధ తటాకాల వైపు తరలివెళ్లనున్నాయి.
శోభాయాత్ర ప్రశాంతంగా, సుఫీలతో కూడి న ఆధ్యాత్మిక వాతావరణంలో సాగేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం(Hyderabad City Police machinery) భారీ భద్రతా చర్యలు, ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. మహానిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ మార్గాల్లో ఆంక్షలు
ప్రధానంగా ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions), మళ్లింపులు ఉండే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పివిఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ఖైరతాబాద్ ఫ్లైఓవర్, జంక్షన్లు ఎంజే మార్కెట్, లిబర్టీ, బషీర్‌బాగ్, సికింద్రాబాద్ పాట్నీ జంక్షన్, రాణిగంజ్, కవాడిగూడ ప్రాంతాలు.
ప్రత్యామ్నాయ మార్గాలు
సాధారణ ప్రయాణికులు అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, మాసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట మార్గాలను ఎంచుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లేవారు ట్యాంక్‌బండ్ మార్గాన్ని కాకుండా పీవీ ఎక్స్‌ప్రెస్ వే లేదా ఓఆర్ఆర్ను ఉపయోగించాలి.
నిఘా నీడలో భాగ్యనగరం
నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిమజ్జనం వేళ 20 వేల మంది పోలీసు బలగాలు విధుల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు తోడు కేంద్ర బలగాలు (ఆర్ఏఎఫ్, సీఆర్ఏఎఫ్), ఇతర జిల్లాల పోలీసులతో కలిపి మొత్తం 20 వేల మందికి పైగా సిబ్బంది పహారా కాస్తున్నారు. ఊరేగింపు మార్గాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు 10 వేల ఏఐ సీసీ కెమెరాలను అనుసంధానించారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో 100 హైరైజ్ కెమెరాలు, గగనతలం నుంచి నిఘా వేసేందుకు 24 డ్రోన్లను రంగంలోకి దించారు.
షీ టీమ్స్ పహారా
మహిళల భద్రత కోసం 26 ప్రత్యేక షీ-టీమ్స్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిమజ్జన ఊరేగింపులో అధిక శబ్దాలు చేసే డీజేలు, సౌండ్ మిక్సర్లు, బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం ఉంటుంది. హుస్సేన్‌సాగర్, ఇతర ప్రధాన చెరువుల వద్ద ముందస్తు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే డయల్ 112 లేదా షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 ను సంప్రదించాలని పోలీసులు కోరారు.