ఎల్ నినో సెగలు

29-09-2026 | 05:15am
  1. రాష్ట్రంలో వేసవిని తలపిస్తున్న ఎండలు
  2. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 డిగ్రీలు అధికం
  3.   2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ప్రమాదం
  4. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో 35 డిగ్రీల నమోదు
  5. ఖమ్మంలో 34.4, హైదరాబాద్‌లో 34 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): పేరుకు వానాకాలం. కానీ, రాష్ట్రం లో చినుకు జాడలేదు. ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత, తీవ్ర వేడితో జనం తి ప్పలు పడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల(Normal temperatures) కంటే  నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు డిగ్రీ మేర పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. సోమవారం నిజామాబాద్, మహబూబ్‌గర్ జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  ఎల్ నినో ప్రభావం కారణంగానే వాతావరణంలో ఈ తరహా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పగటి ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరుగుతున్నా యని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 

రెండు రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభా వంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం చల్లబడి, వర్షాలు కురుస్తుండగా.. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో మాత్రం ఎండలు వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. సాధారణంగా నమోదవాల్సిన ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతుండటంతో తెలంగాణలోని ప్రజలు ఉక్కపోత, తీవ్ర వేడితో అల్లాడిపోతున్నారు.

రికార్డు స్థాయికి..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ప్రధా నంగా నిజామాబాద్, మహబూబ్‌గర్ జిల్లా ల్లో సోమవారం 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే ఏకంగా 4 డిగ్రీలు అధికం. అలాగే ఖమ్మం జిల్లాలో 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్‌లోనూ భానుడి ప్రతాపంతో 34 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. నగరంలో సాధారణంగా నమోదయ్యే 31.8 డిగ్రీల సెల్సియస్‌కు బదులుగా ప్రస్తుతం ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉంటుండటంతో ప్రజలు వర్షాకాలంలో ఎండా కాలం తీవ్రతను చూస్తున్నారు. 

మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ 

ప్రస్తుతం కనిపిస్తున్న ఈ అకాల వేడి తీవ్రత ఇక్కడితో ఆగదని, రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మేర అదనంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు