7 September, 2026 | 7:29 AM

రెచ్చిపోతున్న పేకాట మాఫియా..!

07-09-2026 | 06:00am
  1. పోలీసుల దాడులు... నిర్వాహకుల ఎత్తుగడలు!
  2. లాడ్జిలు, రైస్ మిల్స్, ఫంక్షన్ హాళ్లలోనూ సాగుతున్నట్లు స్థానికుల ఆరోపణలు
  3. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారంపై నిఘా ఎక్కడ?
  4. పేకాట మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపేనా?

బాన్సువాడ, సెప్టెంబర్ 6 (విజయ క్రాం తి): పేకాట మాఫియా (Gambling mafia) మళ్లీ రెచ్చిపోతోం దా..? పోలీసుల దాడులు జరుగుతున్నా ని ర్వాహకులు కొత్త కొత్త ఎత్తుగడలతో జూ దాన్ని కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు స్థా నికంగా కలకలం రేపుతున్నాయి. ఒకచోట పోలీసుల నిఘా పెరిగితే మరోచోటికి అడ్డా మార్చుకుంటూ పేకాట నిర్వహిస్తున్నట్లు స్థా నికులు చెబుతున్నారు.

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి నియోజకవర్గాలలోనీ మండల కేంద్రాలలో పట్టణ ప్రాంతా లలో పల్లెల్లో గ్రామ శివారులో పేకాట మా ఫియా రోజురోజుకు అడ్డాలు మారుస్తూ జో రుగా జూదాన్ని సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాన్సువాడ మండలంలోని కొత్తబాది, సింగితం, కోయ్యగుట్ట, ఇ బ్రహీంపేట్, హనుమాజీపేట, కోనాపూర్, గాంధారి మండలం, నస్రుల్లాబాద్ మండ లం, బీర్కూర్ మంజీర పరివాహక ప్రాంతం బాన్సువాడ పట్టణంలోని లాడ్జిలు రైస్ మి ల్లు ఫంక్షన్ హాల్ లో నివాసపు ఇండ్లు వంటి అనేక స్థావరాల్లో గుర్తుచప్పుడు కాకుండా పేకాటను జోరుగా సాగిస్తున్నారు.

పేకాట ఆడే వారి కంటే నిర్వాహకులకే లాభాల పంట పండిస్తుండడంతో, నిర్వాహకులు రోజుకో స్థావరాలను మారుస్తూ, కేవలం ఫోన్ల ద్వారానే పేకాట రాయులను తమ అడ్డాలకు రప్పించుకుంటూ, అడ్డాల వద్ద కావలసిన సదుపాయాలు, తినే  పదార్థాలు, అవసరమైన అన్ని సమకూరుస్తుండడంతో, గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహణ కొనసాగుతుంది.

కొత్తవారికి తెలియకుండా, కేవలం పరిచేస్తులకు, తెలిసినవారికి తమ తమ అడ్డాలకు పేకాట నిర్వాహకులు రప్పించుకుని, మూడో కంటికి తెలియకుండా ఒకరోజు ఒకచోట మరో రోజు మరోచోట నిర్వహిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ దందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

పేకాట స్థావరాల వద్ద పేకాటరాయులకు కావలసిన అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తుండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆట కొనసాగుతుంది. ఇప్పటికైనా పేకాట మాఫియా ఆగడాలను అరికట్టి పేకాట ఆడుతున్న స్థావరాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలతో పేకాట మాఫియాకు పోలీసులు ఉక్కుపాదం మోపేనా...అడ్డాలు మార్చుకుంటున్న నిర్వాహకుల ఆటకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాల్సిందే.

అడ్డాలు మారుతున్నాయి... జూదం మాత్రం ఆగడం లేదు...!

పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ పేకాట నిర్వాహకులు ముందుగానే సమాచారం తెలుసుకుని స్థావరాలను మార్చుకుం టున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీం తో దాడులు ఒకవైపు జరుగుతుండగా, మ రోవైపు కొత్త ప్రాంతాల్లో పేకాట సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.

లాడ్జిలు.. రైస్మిల్లులు.. ఫంక్షన్ హాళ్లు...?

పట్టణం, పరిసర ప్రాంతాల్లోని కొన్ని లా డ్జిలు, రైస్మిల్లులు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రా ంతాలను పేకాటకు ఉపయోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోప ణలపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయి  విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎవరి అండ..?

గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ని ర్వాహకులకు ఎవరి సహకారం ఉందనే ప్ర శ్నలు తలెత్తుతున్నాయి. పేకాట స్థావరాల నిర్వహణ వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నిఘా మరింత కట్టుదిట్టం చేయాలి..

పేకాట వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో పాటు యు వతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పేకాటపై పోలీసు ల దాడులు, అరెస్టుల వార్తలు వెలువడుతు న్న నేపథ్యంలో, బాన్సువాడ పరిసరాల్లోనూ నిఘా ఏర్పాటు చేసి అక్రమ జూదానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యేక దాడులు చేపడతాం..

బాన్సువాడ ప్రాంతాలలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే దా డులు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటు న్నాం. ఇప్పటికే పేకాట స్థావరాలపై ప్రత్యేక దాడులు చేపట్టి పేకాటరాయలను అరెస్టు చేశాం. పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం.

 తుల శ్రీధర్, పట్టణ ఎస్‌హెచ్‌ఓ, బాన్సువాడ.

మరిన్ని వార్తలు