బెంగాళీల సమస్యలను పరిష్కరించాలి

18-09-2026 | 02:31pm

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే హరీష్‌బాబు

కాగజ్ నగర్ (విజయ క్రాంతి): బెంగాలీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు(MLA Dr.Palvai Harish Babu) అసెంబ్లీలో ప్రస్తావించారు. బెంగాలీ సమాజానికి ఎస్సీ సర్టిఫికెట్ల జారీని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని(Government)కోరారు. 1996 తర్వాత సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కాగజ్‌నగర్, చింతలమానేపల్లి మండలాల్లోని 15 గ్రామాల్లో బెంగాలీలు నివసిస్తున్నారని, వారి మాతృభాషకు అనుగుణంగా విద్యా సదుపాయాలు కల్పించాలని కోరారు. 16 బెంగాలీ మీడియం పాఠశాలల్లో 752 మంది విద్యార్థులు ఉండగా, 25 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శాశ్వత నియామకాలు జరిగే వరకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించాలని, డీఎస్సీ, టెట్ అర్హతల్లో బెంగాలీ మీడియం విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు