8 July, 2026 | 11:12 AM

జలుబుకు కారణం ఇదే!

14-05-2024 12:05 AM

వేసవిలో జలుబు ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. వర్షాకాలం, చలికాలంలో అంటువ్యాధులు త్వరగా వ్యాప్తిస్తాయని చెబుతున్నారు. కానీ మన జీవన శైలి మారుతున్న కొద్దీ సూక్ష్మజీవులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. అందువల్ల వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. వేసవిలో జలుబు, దగ్గు కు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల శరీరంలోకి దుమ్ము చేరి అలర్జీకి కారణం అవుతుంది.

వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తుండటంతో.. పుప్పొడి, ధూళి వంటి అలర్జీ కారకాలు గాలి ద్వారా వ్యాప్తిస్తాయి. ఇవి శరీరంలోకి చేరితే జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది ఎయిర్ కండిషన్ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఏసీలో గడిపేవారిలో డ్రైనెస్ పెరుగుతుంది. ముక్కు, చెవి, నోరు కూడా పొడిగా ఉంటాయి. ఇది జరిగినప్పుడు అంటువ్యాధులు పెరుగుతాయి.

ఫలితంగా జలుబు, దగ్గుతో బాధపడవచ్చు. ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే అది అందరికీ వ్యాపించే ప్రమాదం ఉంది. తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడం, గొంతు దురద, పొడి లేదా కఫంతో కూడిన నొప్పితో కూడిన దగ్గు, వేడిగా అనిపించడం, చెమటలు పట్టే జర్వం, వేసవిలో వచ్చే దగ్గు, జలుబు వంటి వాటికి కింది జాగ్రత్తలతో నివారించవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇల్లు, పని ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.