గొప్ప స్వతంత్ర సమరయోధుడు కొర్వి కృష్ణ స్వామి నీలం
పటాన్ చెరు: కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి(Koravi Krishnaswamy Mudiraj Jayanti) పురస్కరించుకొని శుక్రవారం చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన నీలం మధు, హైదరాబాద్ నగర మేయర్ గా పని చేసి ఆయన ముందుచూపుతో చేసిన నగర మాస్టర్ ప్లాన్ చిరస్థాయిగా నిలిచిపోయింది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బడుగుల ముద్దుబిడ్డ మహానేత కొర్వి కృష్ణస్వామి అని, ఆయన ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఆయన బహుజనుల పక్షాన ఉండి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. ఆ మహానేత ఆశయాలను ఆయన స్ఫూర్తితో మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






