దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిల్లా ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమం
కామారెడ్డి,(విజయక్రాంతి): దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని కల్కి ఆలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan)జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కామారెడ్డి డిఎస్పి మధుసూదన్(Kamareddy DSP Madhusudhan), తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతిలు మాట్లాడుతూ... దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నటికీ రావని అన్నారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని కాకుండా సామాజిక అంశాల పైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటితరం ఉపాధ్యాయుల పైన ఉన్నదని అన్నారు. ఆ దిశగా విద్యార్థులకు మార్గదర్శకం చేయాలని అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న 16 మంది ఉపాధ్యాయులకు ఈ పురస్కారాన్ని అందజేశారు.






