4 September, 2026 | 6:58 PM

420 హామీలు, 6 గ్యారెంటీలపై 4వ రోజు బీఆర్ఎస్ నిరసనలు

04-09-2026 | 05:54pm

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో 4వ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(MLA Kalvakuntla Taraka Rama Rao) పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సు నిర్వహించి వంటా-వార్పు చేపట్టారు.

వృద్ధులకు రూ.4 వేల, వికలాంగులకు రూ.6 వేల, మహిళలకు రూ.2,500 పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని నిరసన తెలిపారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడాన్ని నిరసించారు. విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.