తొర్రూర్ ‘పోరు’ పీక్స్..
- బీఆర్‌ఎస్‌లో ముదిరిన టికెట్ ఉత్కంఠ
- ఎమ్మెల్యే మల్‌రెడ్డి కోటను బద్ధలు కొట్టేదెవరు?
- మినీ అసెంబ్లీని తలపిస్తున్న తొర్రూర్ డివిజన్
- బీఆర్‌ఎస్ భారీ వ్యూహం
- మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, బంటి ఫోకస్..
- గెలుపు గుర్రం వేటలో అధిష్ఠానం
- అభ్యర్థిత్వ రేసులో ఐదుగురు కీలక నేతలు..
- ఎవరి బలాలు వారివే..
ఆదిభట్ల: సెప్టెంబర్ 6 (విజయక్రాంతి) జిహెచ్‌ఎంసి ఎన్నికల (GHMC elections) హడాహుడి అప్పుడే మొదలైంది. ఇబ్రహీంపట్నంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్ డివిజన్ రాజకీయాలు (Thorrur Division Politics) ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. విస్తీర్ణంలో, ఓటర్ల సంఖ్యలో దాదాపు ఓ చిన్న అసెంబ్లీ నియోజకవర్గాన్ని తలపించే ఈ డివిజన్ను ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది.
స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి కుటుంబానికి ఉన్న బలమైన రాజకీయ ప్రాబల్యాన్ని, అంగబలాన్ని, అర్థ బలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గులాబీ జెండా ఎగురవేసే ’ఢీ అంటే ఢీ’ అనే స్థాయి అభ్యర్థి కోసం పార్టీ అధిష్ఠానం తీ వ్రంగా అన్వేషిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, డివిజన్లోని ప్రతి వార్డు పరిణామాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నా రు. సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ, క్షేత్రస్థాయి బలంతో పాటు ఆర్థిక సమర్థత కలిగిన గెలుపు గుర్రానికే బి-ఫామ్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.
రేసులో ఐదుగురు నేతలు..
ప్రస్తుతం తొర్రూర్ డివిజన్ బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న ప్రధాన నాయకుల రాజకీయ నేపథ్యం మరియు బలాబలాలను పరిశీలిస్తే రాగన్న గూడకు చెందిన రొక్కం చంద్రశేఖర్రెడ్డి సీనియర్ నేత, రాగన్నగూడ మాజీ సర్పంచ్, హయత్నగర్ మాజీ ఎంపీ పీ, సహకార సంఘం మాజీ చైర్మన్ దివంగత రొక్కం భీంరెడ్డి తనయుడు.గతంలో కౌన్సిలర్గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం. రాగన్నగూడ, కమ్మగూడ, తుర్కయంజాల్, ఇం జాపూర్, బ్రాహ్మణపల్లి, కోహెడ ప్రాంతాల్లో విస్తృతమైన వ్యక్తిగత సంబంధాలు.
గతంలో చైర్మన్ పదవి హామీ దక్కలేదనే సెంటిమెం ట్, కార్యకర్తల బలమైన మద్దతు ఈయనకు ప్రధాన ఆయుధాలు. తొర్రుర్‌కు చెందిన నల్లబోలు ప్రభువర్ధన్రెడ్డి పార్టీ ఆవిర్భావం నుండి అంకితభావంతో పనిచేస్తున్న నమ్మకమైన స్థాని క నాయకుడు. గతంలో కౌన్సిలర్గా ఓటమి చెందినప్పటికీ పార్టీ మారకుండా క్షేత్రస్థాయిలోనే ఉండటం. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, యువ నాయకుడు మంచిరెడ్డి బంటి ఆశీస్సులు, సం పూర్ణ మద్దతు ఉండటం ఈయనకు పెద్ద ప్లస్ పాయింట్.
సామ సంజీవరెడ్డి.. గతంలో స్వల్ప తేడా తో కౌన్సిలర్ పదవి కోల్పోయి, ఆ తర్వాత సహకార బ్యాంక్ డైరెక్టర్గా ఘన విజయం సాధించారు.డివిజన్ వ్యాప్తంగా రైతులు, గ్రామీణ ప్రజలతో ఉన్న గట్టి అనుబంధం. సహకార రంగంలో పనిచేసిన అనుభవం, నియోజకవర్గ స్థాయి రాజకీయ సమీకరణాలపై ఉన్న పట్టు. బ్రాహ్మణ పల్లి కి చెందిన మర్రి సంపతీశ్వర్ రెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న స్థానిక యువ నాయకుడు. క్యాడర్లో మంచి పట్టు, అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణతో నిర్వహించే తత్వం.
పార్టీ అవకాశం ఇస్తే డివిజన్లో ము మ్మర ప్రచారం చేసి గెలిచేందుకు ఉత్సాహం గా ఉన్నారు. కోహెడకు చెందిన కందాల బిందు రంగారెడ్డి మాజీ ఉపసర్పంచ్, స్థానిక ఉద్యమ నాయకుడు. కొహెడను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలనే సెంటిమెంట్ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లిన నేత. మంత్రి, జిల్లా అధికారుల దృష్టికి ప్రజాసమస్యలు తీసుకెళ్లిన రికార్డు ఉండటం, కొహెడ పరిధిలోని ఓటర్ల మద్దతు లభించడం ఈయనకు సానుకూలాంశం.
మల్‌రెడ్డి వర్గానికి చెక్ పెట్టే వ్యూహం..
తొర్రూర్ డివిజన్లో కాంగ్రెస్ బలమైన స్థా నంలో ఉన్న నేపథ్యంలో, ఏ చిన్న పొరపా టు జరగకుండా బీఆర్‌ఎస్ సర్వేల ఆధారంగానే ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గులాబీ దళపతి మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకుంటూ, ఈ ఐదుగురిలో మల్‌రెడ్డి కుటుంబ ప్రభావాన్ని తట్టుకుని విజయం సాధించే సామర్థ్యం ఎవరికి ఉందో లెక్కలేస్తున్నారు.
ఆశావహులం దరినీ సమన్వయం చేస్తూ, తిరుగుబాటు లేకుండా ఏకతాటిపైకి తెచ్చి పోటీకి దించడమే బీఆర్‌ఎస్ ముందున్న ప్రధాన సవాలు. రాబోయే రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ఎంపికపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముండటంతో, తొర్రూర్ పొలిటికల్ హీట్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.






