తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
20-09-2026 | 12:15pm
గణపురం, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చిక యాదినారాయణ(Yadinarayana) గౌడ్ ఆదివారం ఉదయం తాడిచెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి. యాది నారాయణ గౌడ్ రోజువారి పనిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో మోకు జారి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.