ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన ఆణిముత్యం పూనెం సహస్ర

16-09-2026 | 07:37pm

ఆళ్ళపల్లి సెప్టెంబర్ 16, (విజయక్రాంతి): మండల పరిధిలోని రామంజి గూడెం పంచాయతీ, తునికిబండల గ్రామానికి చెందిన, పూనెం రాజమల్లు-చంద్రమ్మ మనవరాలు 2026 సంవత్సరంలో నిర్వహించిన నీట్ పరీక్ష(NEET exam)లో 410 మార్కులు సాధించి, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 249312 పొందారు.

ఆమె ప్రతిభను గుర్తించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్ అడ్మిషన్ల రెండవ దశ కౌన్సెలింగ్‌లో పూనెం సహస్త్రకు వైద్య విద్య వరంగల్ లో సీటును కేటావించడం జరిగింది. సహస్త్రకు, ఎంబిబిఎస్  సీటు రావడం పట్ల కుటుంబ  సభ్యులు,గ్రామస్తులు హర్షం, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు