ఐలమ్మ వర్ధంతికి ఘన నివాళులు

10-09-2026 | 08:11pm

పోతుగల్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి(Death anniversary of Chakali Ilamma) సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ... నాటి నిజాం నిరంకుశ పాలనకు,భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.రజక సంఘం అభివృద్ధికి మనమంతా కృషి చేయాలని నాయకులు కోరారు.

మరిన్ని వార్తలు