జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘన స్వాగతం
సైనిక వందనం సమర్పణ
అమెరికా ఆండ్రూస్ విమానాశ్రయానికి చేరుకున్న చైనా అధ్యక్షుడు, సతీమణి
బీ1 యుద్ధ విమానం శబ్దానికి కలవపాటుకు గురైన అమెరికా అధ్యక్షుడు
వైట్‌హౌస్‌లో విందు, అనంతరం ద్వైపాక్షిక చర్చలు
తైవాన్, రష్యాచమురు, సుంకాలపై చర్చలుండే అవకాశం
వాషింగ్టన్, సెప్టెంబర్ 24: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Chinese President Xi Jinping) సతీ సమేతంగా గురువారం ఉదయం అమెరికాకు చేరుకున్నారు. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు విచ్చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Donald Trump), ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు ఘన స్వాగతం పలికారు.
స్వాగతం పలికేందుకు ట్రంప్ ప్రొటోకాల్‌ను సైతం పక్కన పెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా విమానాశ్రయంలో అమెరికాకు చెందిన 500మంది సైనికులు జిన్‌పింగ్‌కు సైనిక వందనం సమర్పించారు. అనంతరం ఇరుదేశాల జాతీయ గీతాలాపన కొనసాగింది. జాతీయాలాపన కొనసాగుతుండగా గగనతలంపై నుంచి బీ బాంబర్ యుద్ధ విమానం గౌరవ సూచకంగా ఎగురుతూ దూసుకువెళ్లింది. ఈ సందర్భంగా ట్రంప్ ఆ పెద్ద శబ్దానికి కలవరపాటుకు గురయ్యారు.
జిన్‌పింగ్ రాక సందర్భంగా స్వాగతానికి పరిచిన రెడ్ కార్పెట్‌ను భద్రతా సిబ్బంది చేతులతో శుభ్రం చేయడం గమనార్హం. జిన్‌పింగ్ దంపతులకుకు వైట్‌హౌస్‌లో అధికారిక విందు ఏర్పాటు చేశారు. అనంతరం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో ముఖ్యంగా తైవాన్, రష్యా నుంచి చమురు, గ్యాస్‌ల కొనుగోలు, సెమీ కండక్టర్ తయారీ తదితర అంశాలపై చర్చించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్, జిన్‌పింగ్ ఈ ఏడాదిలో కలవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత రెండు సమావేశాల్లో ఈ ఇరువురి మధ్య పెద్ద ఒప్పందాలేవీ కుదరలేదు కానీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పదే పదే ట్రంప్ సుంకాల బెదిరింపులతో గుర్రుమీదున్న చైనా అధ్యక్షుడు ఎట్టకేలకు సమావేశం అవుతుండడం విశేషం.