ట్రంప్ మరో షాక్! H-1B visa నిబంధనలు కఠినం
H-1B వీసాలపై ట్రంప్ షాక్
లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్ మళ్లీ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొన్ని రకాల కొత్త H-1B వీసా దరఖాస్తులకు సంబంధించిన 1,00,000 డాలర్ల రుసుము నిబంధనను 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో ఈ నిబంధనలు మరింత కఠినం అయ్యాయి. శుక్రవారం జారీ చేసిన అధ్యక్ష ప్రకటనలో 1,00,000 అమెరికన్ డాలర్ల రుసుమును విధించే నిర్ణయం కారణంగా పెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థల నుంచి వచ్చే H-1B రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఫీజును ఏడాది కాలం పొడిగించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది. ట్రంప్ నిర్ణయంతో భారతీయ వృత్తి నిపుణుల పై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు వెల్లడించారు.
"2025 నాటి ప్రకటనను పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలకు రక్షణ లభిస్తుంది, అలాగే అమెరికన్ కార్మికులు, పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా, ఈ కార్యక్రమం అసలు ఉద్దేశానికి అనుగుణంగా, అత్యంత నైపుణ్యం కలిగిన, అత్యవసరమైన విదేశీ కార్మికులను మాత్రమే అవసరమైనప్పుడు నియమించుకునేలా ఇది నిర్ధారిస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు.