ఘట్ కేసర్–కాజీపేట 4వ రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

10-09-2026 | 08:40pm

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకుల పాలాభిషేకం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి(Telangana Development)కి, రైల్వే మౌలిక వసతుల బలోపేతానికి రూ. 2,419 కోట్లతో సుమారు 110 కి.మీ. మేర 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్(Union Cabinet) ఆమోదం తెలిపిన సందర్భంగా గురువారం ఘట్ కేసర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి(BJP President Kommidi Mahipal Reddy) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి కృతజ్ఞతగా ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కంభం లక్ష్మా రెడ్డి, సగ్గు మోహన్ రావు, ఉపాధ్యక్షులు పడిగం వీరేశం, ప్రధాన కార్యదర్శి మంగు రాధిక, కార్యదర్శి మడిపడిగే అంజయ్య, కిసాన్ మోర్చా కట్ట మధుసూదన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు మమతా శర్మ, రేఖ సోని, మంగు శ్రీనివాస్ రావు, కార్యకర్తలు  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు