సిలిండర్ పేలుడు.. నలుగురు మృతి!

29-09-2026 | 08:01am

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మాల్వాన్‌(Malvan)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్(Cylinder) పేలడంతో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

సురేశ్ గుప్తా ఇంట్లో వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పేలుడు ధాటికి సమీపంలోని మరికొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని వార్తలు