అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి రాజీనామా
23-05-2026 02:01 AM
వాషింగ్టన్, మే ౨౨: అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్‌ఐ) తులసీ గబ్బార్డ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త అబ్రహం బోన్ క్యాన్సర్ బారిన పడ్డారని, ఇలాంటి కష్టసమయంలో భర్తకు తోడుగా ఉండాలని నిశ్చయించుకుని తన కొలువుకి రాజీనామా చేసినట్లు తులసి స్పష్టం చేశారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో తన నిర్ణయాన్ని ట్రంప్‌కు తెలియపరిచామని వెల్లడించారు.
కొలువుకు రాజీనామా చేసినప్పటికీ, ఆ దేశ నిబంధనల ప్రకారం ఆమె జూన్ 30 వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంది. మరోవైపు, తన భర్త ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు తులసి ప్రకటించినప్పటికీ, వైట్‌హౌస్ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చిందని మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.






