23 May, 2026 | 1:05 AM

‘సీజే పీ’కి పాక్ నుంచి ఫాలోవర్లు

23-05-2026 12:33 AM
  1. వ్యవస్థాపకుడు ఐఎస్‌ఐ ఏజెంట్
  2. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
  3. పాక్ జనతా పార్టీ అంటూ ఎద్దేవా

న్యూఢిల్లీ, మే ౨౨: కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) ‘ఎక్స్’ ఖాతాకు సోషల్‌మీడియాలో పాక్ నుంచే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉ న్నారని, ఆ వ్యంగ్య పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక పాక్ గూఢచార సంస్థ అయిన ఐఎస్‌ఐకి ఏజెంట్ అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫాలోవర్స్‌లో పాక్ నుంచి ౪౮ శాతం మంది, అమెరికా నుంచి ౧౪శాతం మంది, బంగ్లాదేశ్ నుంచి ౧౪శాతం మంది ఉన్నారని చెబుతున్నారు. భారత్ నుంచి కేవ లం ౯శాతం మందే ఉన్నారని ప్రకటిస్తున్నారు. విదేశాల నుంచి కొందరు మ్యూల్ అ కౌంట్లు, నకిలీ అకౌంట్ల ద్వారా ఫాలోవర్స్‌ను పెంచుతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు నేతలైతే సీజేపీని ‘పాకిస్తాన్ జనతా పార్టీ’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియా లో సీజేపీ మద్దతుదారులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్యుద్ధం నడుస్తున్నది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘నిరుద్యోగ బొద్దింకల’ వ్యాఖ్య ల తర్వాత ఇన్‌స్టాగ్రాం వేదికగా కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) అనే వ్యంగ్య పార్టీ పు ట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పార్టీకి లక్షల మంది ఫాలోవర్లు పెరగడం, నిఘా వర్గాలు గుర్తించి ‘ఎక్స్’ ఖాతాను తొలగించడం కూడా చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. మొదటి ఖాతాను సృష్టించిన ఆ ప్ మాజీ వ్యూహకర్త అభిజిత్ దీప్కేనే మరో ‘కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ బ్యాక్’ పేరుతో మరో ఖాతా తెరిచారు. ఈ ఖాతాకు గంటగంటకు ఫాలోవర్లు లక్షలాదిగా పెరుగుతు న్నారు. గతంలో ఆప్‌లో పనిచేశారు.