బొల్లారంలో పశువైద్య శిబిరం

23-09-2026 | 05:02pm

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామంలో పశుసంవర్ధక శాఖ,జిల్లా పశుసంపద అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సంతానోత్పత్తి,పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో 24 పశువులకు గర్భనిర్ధారణ పరీక్షలు చేయగా, ఆరు గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినట్లు మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. తొమ్మిది పశువులకు కృత్రిమ గర్భధారణ పరీక్షలు చేశారు.

మరో 24 పశువులకు సాధారణ చికిత్స అందించి, ఒక కుక్కకు వైద్యం చేసినట్లు మండల పశువైద్యాధికారి రవికుమార్ తెలిపారు. 25 దూడలకు నట్టల నివారణ మందులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రభు గౌడ్,మండల పశు వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ కార్యదర్శి సంతోష్,సూపర్వైజర్ గోపాలమిత్ర కృష్ణ,సిబ్బంది విజయ, జయరాజ్,గంగారం,మైత్రి శ్రీహరి, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు