ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ‘విద్య ప్లస్’

08-09-2026 | 05:30am

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘విద్య ప్లస్’ పైలట్ ప్రాజెక్ట్ను పకడ్బం దీగా అమలు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం ఎస్‌ఐఆర్2026లో భాగంగా జిల్లాకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలకురాలు డా. యోగితా రాణాకు విద్యా ప్లస్పు సమీక్ష నివేదికను అందజేశారు.

యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికత ఆధారిత, రియల్టైమ్ పర్యవేక్షణతో కూడిన బోధనా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని గుర్తించి, అవసరమైన మేరకు బోధనా విధానాల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.డిజిటల్ పరికరాలు లేని విద్యార్థుల కోసం ప్రింటెడ్ క్యూ.ఆర్./ఆర్కో కార్డులతో మూల్యాంకనం నిర్వహించనున్నట్లు చెప్పారు.

విద్యార్థులు ఏ, బీ, సీ, డీ సమాధాన కార్డులను ప్రదర్శించగా, ఉపాధ్యాయులు వెబ్క్యామ్ ద్వారా స్కాన్ చేసి ఫలితాలను తక్షణమే నమోదు చేసే విధానం అమలు చేస్తామని వివరించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధనా సహా యక వ్యవస్థ ద్వారా పాఠ్యాంశాల సారాంశాలు, సందేహాల నివృత్తి, వీడియోలు, సిమ్యులేషన్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

రోజు వారీ బోధన, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన స్థాయిని పర్యవేక్షించేందుకు రియల్టైమ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థుల మధ్య అభ్యసన అంతరాలను తగ్గించి, అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించవచ్చని యువరాజ్ మర్మాట్ పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు