7 September, 2026 | 11:11 AM

విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ దాడులు ఆపాలి

07-09-2026 | 09:38am

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 06 ( విజయక్రాంతి ) : రైస్ మిల్లులపై విజిలెన్స్9Vigilance), ఎన్ఫోర్స్ మెంట్ దాడులు(enforcement raids) ఆపాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(Gandra Satyanarayana Rao)కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల తిరుపతి గౌడ్, గౌరవ అధ్యక్షులు కోరే రమేష్ లు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిట్ట బిక్షపతి, అర్గనైజింగ్ సెక్రటరీ అభినవ్ రావు, జాయింట్ సెక్రటరీ ఉమ్మల రవీందర్, సలహాదారులు పోరండ్ల వేణు, ఈసీ బాడీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు