7 September, 2026 | 10:40 AM

అండర్‌-16క్రికెట్‌ మ్యాచ్‌లకు మణుగూరు నుంచి ఇద్దరు ఎంపిక

07-09-2026 | 09:34am

మణుగూరు, సెప్టెంబర్ 6,( విజయ్ క్రాంతి ): హైదరాబాద్‌లో జరగనున్న అండర్‌-16 క్రికెట్‌ మ్యాచ్‌ల(cricket matches)కు మణుగూరులోని ఎలైట్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి ఇద్దరు ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంపికయ్యారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న టీ.జీ.టీ. కౌశిక్‌, ఎస్‌.వీ. మోక్షిత్‌ వర్మలు సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌లో జరగనున్న అండర్‌-16 మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్‌ 7న సాయంత్రం హైదరాబాద్‌లోని జింఖానా మైదానం(Gymkhana Grounds)లో నివేదించాల్సిందిగా ఖమ్మం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చెకూరి వెంకట్‌ తెలిపారు.

ఎలైట్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి ఇద్దరు క్రీడాకారులు అండర్‌-16 స్థాయి మ్యాచ్‌కు ఎంపిక కావడం పట్ల అకాడమీ ప్రధాన కోచ్‌ డేవిడ్‌ రిచర్డ్స్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో రాణించి మణుగూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఇద్దరు క్రీడాకారుల ఎంపికతో అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇతర క్రీడాకారుల్లోనూ నూతన ఉత్సాహం నెలకొంది. మణుగూరు ప్రాంతం నుంచి అండర్‌-16 స్థాయి క్రికెట్‌ పోటీలకు ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో జరగనున్న అండర్‌-16 క్రికెట్‌ మ్యాచ్‌లకు మణుగూరులోని ఎలైట్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి ఇద్దరు ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంపికయ్యారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న టీ.జీ.టీ. కౌశిక్‌, ఎస్‌.వీ. మోక్షిత్‌ వర్మలు సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌లో జరగనున్న అండర్‌-16 మ్యాచ్‌కు ఎంపికయ్యారు.ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్‌ 7న సాయంత్రం హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో నివేదించాల్సిందిగా ఖమ్మం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చెకూరి వెంకట్‌ తెలిపారు.ఎలైట్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి ఇద్దరు క్రీడాకారులు అండర్‌-16 స్థాయి మ్యాచ్‌కు ఎంపిక కావడం పట్ల అకాడమీ ప్రధాన కోచ్‌ డేవిడ్‌ రిచర్డ్స్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో రాణించి మణుగూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఇద్దరు క్రీడాకారుల ఎంపికతో అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇతర క్రీడాకారుల్లోనూ నూతన ఉత్సాహం నెలకొంది. మణుగూరు ప్రాంతం నుంచి అండర్‌-16 స్థాయి క్రికెట్‌ పోటీలకు ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు