నిరుపేద పారిశుద్ధ్య కార్మికునికి క్షీణించిన ఆరోగ్యం

03-10-2026 | 04:37pm

అండగా నిలుస్తున్న గ్రామస్తులు. 

బోథ్. అక్టోబర్ 3 (విజయక్రాంతి) : మండలంలోని కౌట (బి) గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు గంగాధర్ వీరేష్(Gram Panchayat worker Gangadhar Viresh) గత కొంతకాలంగా నరాల బలహీనత, రక్తహీనత, ఊరిక్ యాసిడ్ వ్యాధితో(Uric acid disease) బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈయన గత కొన్ని రోజులుగా మంచానికే పరిమితం కావడంతో కుటుంబీకులు ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాధిని నయం చేసేందుకు గాను అప్పుచేసి ఆసుపత్రుల(Hospitals) చుట్టూ తిరిగారు. ఆర్థిక పరిస్థితి దీనావస్థలో ఉండడంతో చేసేదిలేక కుటుంబీకులు ఆదుకునే దాతలు కోసం ఎదురు చూస్తున్నారు....

ముందుకు వచ్చిన గ్రామస్తులు....

గ్రామ పారి శుద్ధ కార్మికుని దీనావస్థను చూసిన గ్రామస్తులు తమతో చేతనైనంతవరకు సహాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కిషోర్ కుమార్ 5000 రూపాయలు ఆర్థికi సహాయం అందించగా, అదే గ్రామానికి చెందిన భవాని యూత్ వారు మరో ఐదు వేల ఆర్థిక సాయం అందించారు. అనేకమంది గ్రామ యువకులు పెద్దలు తోచినంతగా 500 నుండి 1000 రూపాయల వరకు కార్తీక సహాయం అందిస్తూ వస్తున్నారు. అయితే వ్యాధి బారిన పడ్డ వీరేశమును ఆదుకునేందుకు మరి కొంతమంది దాతలు వస్తే పేద కుటుంబానికి చెందిన ఈయన ప్రాణాలు దక్కుతాయని గ్రామస్తులు అంటున్నారు.

మరిన్ని వార్తలు