వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివ శంకర్ గౌడ్
గణపురం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): వరంగల్ జిల్లాలో నిర్మించనున్న విమానాశ్రయానికి తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna Goud) పేరు పెట్టాలనిజాతీయ బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association)జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శివ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప యోధుడని పేర్కొన్నారు.
ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరారు. తెలంగాణ చరిత్రలో పాపన్న గౌడ్‌కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ప్రభుత్వం బీసీ సంఘాల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడం ఆయనకు సముచిత గౌరవమని శివ శంకర్ గౌడ్ పేర్కొన్నారు.