ఎల్ నినో ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం: ఎంపీడీవో
బోథ్ అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మండలంలోని ప్రజలను ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం చేస్తున్నామని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) పేర్కొన్నారు. వర్ష భావం పరిస్థితుల వల్ల బోరు బావులు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బోరు బావులు తవ్వితే తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలని లేకుంటే చర్యలు తప్ప ఉన్నారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శులు ప్రజలకు తగు సూచనలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఒకరోజు కూలికి 307 రూపాయలు చెల్లించడం జరుగుతున్నందున కూలీల సంఖ్య పెంచి ప్రజలందరికీ ఉపాధి కల్పించేందుకు తమ చర్యలు చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బందికి వివరించామన్నారు. మండలంలో 76 ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడం జరిగిందని మరో 121 ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.
అయితే రైతులు నీటి ఎద్దడి నివారణకు దృష్టిలో ఉంచుకొని ఫారం ఫండ్ ల నిర్మాణం జరుపుకోవాలని సూచించారు. పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాల కార్యదర్శులకు ఆశ కార్యకర్తలకు వైద్య సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాల కార్యదర్శి ప్రతిరోజు ఒక వార్డును సందర్శించి వార్డులోని సమస్యలను తెలుసుకొని తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో వారిని అప్రమత్తంచేశామన్నారు.
300 చేయూత పెన్షన్లకు దరఖాస్తులు రావడం జరిగిందని పూర్తిస్థాయిలో విచారణ జరిపి మంజూరి ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రబీ వేయకుంటేనే మంచిదన్నారు. గ్రామాల కార్యదర్శిలు ఉదయం తొమ్మిది గంటలకు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దని తెలుపుతున్నామని అన్నారు.