రగులుతున్న పశ్చిమాసియా
అగ్ర దేశాధీశుడననే ట్రంప్(Donald Trump) అహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మధ్య ప్రాచ్యంలో రావ ణకాష్ఠం మరింతగా రగులుతున్నది. పగ, ప్రతీకారాలు, అసూయాద్వేషాలు, అధికార మదం, ఆధిపత్య, అహంకార భావా లు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో ప శ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలను చూస్తే అవగతమవుతుంది.
దీనికి మూల కారణం ట్రంప్. మధ్య ప్రాచ్యంలో యుద్ధం(War) అనేక మలుపులు తిరుగుతూ చివరకు ఏం జరుగుతుందో అర్ధం కాని సంకటస్థితిలోకి నెట్టబడింది. సౌదీ రాజధాని రియా ద్‌ను యెమన్‌కు చెందిన హూతీలు లక్ష్యం గా చేసుకోవడం, క్షిపణి దాడులకు య త్నించడం మక్కా, మదీనాలపై తమ దృష్టి ని గురిపెట్టడం ద్వారా ప్రపంచాన్ని పూర్తి గా భయం గుప్పెట్లోకి తీసుకుపోయారు.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఉరుము ఉరిమి మంగ ళం మీద పడ్డట్టుగా అమెరికా-, ఇరాన్‌ల మధ్య యుద్ధం సౌదీ అరేబియా -హూతీల మధ్య యుద్ధంగా రూపాంతరం చెం దింది. యెమన్‌లోని ఇరాన్ అనుకూల హూతీలు సౌదీలోని చమురు సదుపాయాలను విధ్వంసం చేయడమే కాకుండా ఎర్రసముద్రంలోని బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని స్వాధీనం చేసుకుని సౌదీ వాణిజ్య నౌకలను దిగ్భంధనం చేసి, అంతర్జాతీయ చమురు రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టారు.
హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ బాబ్ ఎల్- మండేబ్‌ను వినియోగిస్తున్నది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న సౌదీని హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు. మొఖా ఓడరేవును, కొన్ని కీలకమైన ద్వీపాలను హూతీలు ఆక్రమించుకున్నారు. ఇప్పటికే సౌదీలోని ఈస్ట్-వెస్ట్ క్రూడాయిల్ పైప్‌లైన్‌పై హూతీలు డ్రోన్ దాడులు చేసి తీవ్రం గా నష్టపరిచారు. బాబ్ ఎల్ మండేబ్ జలసంధినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం తో భారత్ కూడా ఇబ్బందుల్లో పడింది.
పలు ఆసియా, ఐరోపా దేశాల చమురు స రఫరా నిలిచిపోయింది. హిందూ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రానికి గల ఏకైక కీలక సముద్ర మార్గం ‘గేట్ ఆఫ్ టి యర్స్‘గా పిలవబడే 32 కిలోమీటర్ల వెడ ల్పు గల అంతర్జాతీయ రవాణా మార్గం ‘స్ట్రయిట్ ఆఫ్ బాబ్ ఎల్ మండేబ్‘. ఈ మార్గం మూతబడితే ప్రత్యామ్నాయ మా ర్గం మరింత వ్యయప్రయాసలతో దూరభారంతో కూడుకున్న వ్యవహారంగా మా రుతుంది. భారత్‌కు సౌదీ నుండి పక్షం రో జులకు రావలసిన ఇంధన నౌకలు సౌతాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి రావడానికి రెట్టింపు సమయం పడుతుంది.
ఒకవైపు హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, మరో వైపు ఎర్ర సముద్రంపై హూతీల ఆధిపత్యం, మొఖా పోర్టు స్వాధీ నం వెరసి భారత్‌లో చమురు సంక్షోభం ముదిరేలా చేసింది. హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధనానికి ఆయువు పట్టు కాగా, ఇప్పుడు రెడ్ సీపై హూతీలు పట్టు సాధించడం మరో ముప్పుగా పరిణమించింది. అమెరికా నుండి కొనుగోలు చేసిన యుద్ధ విమానాన్ని కూల్చిన హూతీలు ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్‌పై ఆధిపత్యం సాధించారు. హూతీలు ఇరాన్‌కు బలంగా మారారు. మక్కా కూడా ప్రమాదంలో పడింది.
ఇటీవల హూతీల దాడుల దృ ష్ట్యా సౌదీ ఆత్మరక్షణలో పడింది. భౌగోళిక పరిస్థితులు, గెరిల్లా తరహా వ్యూహాలు హూతీలకు ఆయుధంగా మారడం విశే షం. సౌదీ అరేబియా భద్రత సంక్షోభంలో పడింది. అమెరికా అండ చూసుకుని తిరుగు లేదనుకున్న సౌదీ భయకంపితమైనది. రియాద్ భద్రతకు ముప్పు వాటిల్ల డమే కాకుండా, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, ఎర్ర సముద్రంలో నావల దిగ్భంధనం వలన సౌదీ ఆర్ధిక సం క్షోభంలో చిక్కుకుంది. అరామ్ కో ‘ఈస్ట్- వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‘ మూసివేయడంతో ప్రపంచం మరింత చమురు సంక్షోభంలోకి నెట్టబడింది.
ఈ పరిస్థితుల్లో తమకు ఆధునాతన ఆయుధాలు కావాలని అమెరికాను సౌదీ అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. యె మెన్‌లోని హూతీలు అమెరికా మేడ్ సౌదీ ఎఫ్ -15ను కూల్చడంతో అమెరికా కూడా హూతీల జోలికి పోవడం లేదు. హూతీలతో అమెరికా రహస్య ఒప్పందం చేసుకు ని, రెడ్ సీలో తమ నౌకలను కాపాడుకుంటుందనే వార్తల నేపథ్యంలో తమకు సా యం చేయాలన్న సౌదీ విన్నపాన్ని అమెరికా తోసిపుచ్చడంలో ఆశ్చర్యం లేదు. ఇదే సందర్భంలో టర్కీ, పాక్, సౌదీ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం నీరుగారింది.
ఈ నేపథ్యంలో సౌదీ పాలకులు ఇజ్రాయిల్ సాయం కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. హూతీల దాడితో ముదిరిన మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో పడేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్‌లో కూడా చమురు సంక్షో భం తీవ్రతరం కావడం తథ్యం. విదేశీ ఇంధనంపై ఆధారపడ్డ పాక్‌లో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ప్రజలపైన, వ్యాపారాలపైన పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిం ది.
పెళ్లిళ్ళలో ఒకే వంటకానికి పరిమితం చేసింది. వాహనాల కొనుగోలు, ప్రయాణాల తగ్గింపుపై ఆంక్షలు విధించారు. పాక్‌లో పెట్రోలు ధర సుమారు రూ.40 లకు చేరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా, రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ భీకర దాడు లు చేసి విధ్వంసం చేయడంతో చమురు సరఫరా సంక్షోభంలో పడింది. ఇదే సందర్భంలో రష్యా నుండి చమురు కొంటున్న భారత్, చైనాలపై అమెరికా 100 శాతం టారిఫ్ విధించడం పైశాచిక చర్యగా భావించక తప్పదు. అమెరికా చట్టసభలు ట్రంప్ చేతికి టారిఫ్‌ల కొరడా అందించడం అనుచితం. రష్యా విషయంలో ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ అమెరికా పవర్ గ్రిడ్ల కోసం రష్యా నుండి యురేనియం కొనుగోలు చేయడం ద్వంద్వ నీతి కాదా? ట్రంప్ చేతిలో అధికారం ప్రపంచ దేశాల చావుకొచ్చింది.
ఇజ్రాయిల్ సలహాతో ఇరాన్‌పై అకారణ యుద్ధానికి పూనుకొన్న ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. కొన్ని దేశాల ప్రజలు విద్యుత్, ఆహార కొరతతో అలమటిస్తున్నారు. ఎంత కాలం యుద్ధాలు కొనసాగి స్తారు? ఎంతకాలం ప్రజలను ఇబ్బంది పెడతారు? ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు అమెరికాను నిలువరించలేవా? ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరింపచేయడంలో ప్ర పంచ దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఎంత కాలం అమెరికాకు దాసో హం చేస్తారు? ప్రజాభీష్టానికి విరుద్ధంగా సాగుతున్న యుద్ధాలు మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
సామాజిక విశ్లేషకులు,
మోటివేషనల్ స్పీకర్, 704903463.
- సుంకవల్లి సత్తిరాజు