మిస్ ఇంగ్లాండ్ లైంగిక ఆరోపణలపై చర్యలేవి?
- నిందితులను పోలీసులు కాపాడుతున్నారా?
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎంట్రెన్స్ గేటు(Assembly entrance gate) వద్ద ఇటీవల జరిగిన గందరగోళం నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ(BRS MLAs and MLC)లపై లైంగిక వేధింపుల కేసులు(Sexual harassment cases) నమోదు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండిపడ్డారు. ఈ చెత్త కేసును మేము న్యాయస్థానాల(courts)లో ఎదుర్కొంటాం.. కానీ హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల(Miss World pageants) సమయంలో అభ్య ంతరకరంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుల(Congress leaders)పై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ(Miss England Milla Magee) చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏమయ్యాయని డీజీపీని ప్రశ్నించారు.
ఈ మేరకు శని వారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ... పోలీసులు నిందితులను కాపాతున్నారా?, దీనికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నించారు. అసె ంబ్లీ గేటు ముందు జరిగిన గందరగోళంపై సీఎం తన పోలీసులతో లైంగిక కేసులు న మోదు చేయించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు.