అంబులెన్స్ లోనే డెలివరీ.. తల్లి బిడ్డ క్షేమం

26-09-2026 | 09:33am

వెంకటాపురం వైద్యశాలకు తరలింపు. 

వెంకటాపురం, నూగూరు,(విజయక్రాంతి): ములుగు జిల్లా  వెంకటాపురం మండలం  పాలెం గ్రామానికి చెందిన సున్నం భాగ్యవతి పురిటి నోప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం మేరకు, వెంకటాపురం 108 అంబులెన్స్ లో శుక్రవారం సాయంత్రం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోని పాత్ర పురం వద్ద పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈఎంటి సతీష్, పైలట్ కుమార్ స్వామి సుఖప్రసవానికి సపర్యాలు నిర్వహించారు. ఈ మేరకు ఆమె బంధువులు 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు