విలాస్‌నగర్ లో మహిళల ఘనంగా కుంకుమ పూజ
21-09-2026 | 04:05pm
జనగామ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జనగామ పట్టణంలోని విలాస్‌నగర్ కాలనీలో వినాయకుడి మండపం వద్ద మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం (Saffron Puja program)భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మహిళల భక్తి పూజలతో కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో శ్రావణి, నాగక్క, మంజుల, భాగ్య, కమల, యశోద, పావని, కల్పన, లలిత, సరిత, మమత, పద్మ, కళావతి తదితర మహిళలు పాల్గొన్నారు.