సెంట్ మేరీస్లో ఘనంగా స్త్రీల మైత్రి పండుగ
13-09-2026 | 04:59pm
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలోని సి.ఎస్.ఐ. సెంట్ మేరీస్(St. Marys) దేవాలయంలో ఆదివారం స్త్రీల మైత్రి పండుగను ఘనంగా నిర్వహించారు. బీరోలు పాస్ట్రేట్ చైర్మన్ బీమా పాల్, పాస్టర్ వరస అర్జున్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనా కూడికలో ఇవాంజెలిస్ట్ శృతి వాక్యోపదేశం చేశారు. సమాజంలో స్త్రీల పాత్ర కీలకమని, యేసుక్రీస్తు స్త్రీలను గౌరవించి ప్రోత్సహించారని ఆమె తెలిపారు.
మంచి కుటుంబం, సమాజ నిర్మాణానికి క్రీస్తు బోధనలు పాటించాలని, మహిళలు పరిశుద్ధమైన జీవితం గడుపుతూ కుటుంబాలకు దివిటీలుగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో స్త్రీల మైత్రి ప్రతినిధులు, పాస్టర్లు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.