ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

08-09-2026 | 11:51pm

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ప్రపంచ ఫిజియోథెరఫీ దినోత్సవాన్ని(World Physiotherapy Day) ఎల్లంపేట్ మున్సిపల్ ఘనపూర్ మెడిసిటీ కళాశాల ఆఫ్ ఫిజియోథెరఫీ డాక్టర్ లు ఘనంగా నిర్వహించారు. నేడు విశ్వవ్యాప్తంగా నిర్వహించే ఫిజియోథెరఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడిసిటీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ ఘనపూర్ మేడ్చల్(Medicity College of Physiotherapy Ghanpur Medchal) వారు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా ఫిజియోథెరఫీ చదువుతున్న విద్యార్థులకు పలు రకాలైన పోటీలను నిర్వహించారు. మంగళవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్,షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ డాక్టర్ సి మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

అనంతరం జ్యోతి ప్రజ్వళనతో ప్రారంభమైన కార్యక్రమంలో డాక్టర్ మల్లికార్జున రెడ్డి తో పాటు ప్రిన్సిపాల్ మెడిసిటీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ డాక్టర్ మహమ్మద్ రఫీ, డైరెక్టర్ రీసెర్చ్ డాక్టర్ రమేష్ రెడ్డి, హెడ్ ఆర్థోపెడిక్ విభాగం మెడిసిటీ ఆసుపత్రి మెడికల్ సైన్సెస్ ఫ్రొఫెసర్ ఎస్ హైమావతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ... నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో ఫిజియోథెరఫీ యొక్క ప్రాధానుతను వివరించారు. అదేవిధంగా పలు వ్యాధులకు చికిత్స అందించిన తర్వాత ఫిజియోథెరఫీ తో సదరు రోగి శారీరకంగా సాధారణ స్థితికి చేరుకోవడానికి దోహద పడుతుందని ఆయన చెప్పారు.

గత నాలుగు సంవత్సరాలుగా పలు అంటూ వ్యాధులు కాని వ్యాధుల చికిత్సలో ఫిజియోథెరఫీ పోషించే కీలక పాత్రపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారని డాక్టర్ మహమ్మద్ వెల్లడించారు. ఇదే కోవలోనే 2026 లో నేటి ప్రపంచ ఫిజియోథెరఫీ దినోత్సవం నాడు గుండె జబ్బులకు చికిత్స అందించే సందర్భంలో ఫిజియోథెరఫీ ఎలాంటి కీలక భూమిక పోషిస్తుందనే విషయంపై చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ముక్యంగా గుండెకు సంబంధించిన పలు రుగ్మతలను మందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే విలువైన ప్రాంతాలను కాపాడవచ్చని డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ కళ్యాణ్.కళాశాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు