కిరాణా వర్తక సంఘానికి సొంత భవనాలను నిర్మించాలి....

05-10-2026 | 10:07pm

కోకల రవీందర్ గుప్తా...

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు వినతి.....

యాదగిరిగుట్ట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): యాదగిరిగుట్టలో 50 సంవత్సరాలుగా కిరాణం వర్తకం నిర్వహించుకుంటూ సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సొంత భవనాలను ప్రభుత్వం నిర్మించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Whip Beerla Ilaiah)కు శ్రీ యాదాద్రి కిరాణా వర్తక సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం ప్రభుత్వ విప్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించి నిర్మాణాలకు ప్రభుత్వ భూమి ఉంటే నిర్మాణాలకు సహకరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని శ్రీ యాదాద్రి కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు కోకల రవీందర్ గుప్తా తెలిపారు.   

ఈ కార్యక్రమంలో వర్తక సంఘo ప్రధానకార్యదర్శి, కూరెళ్ళ రమేష్ గుప్తా, కోశాధికారి నంగునూరి బాలరాజు గుప్తా, ఉపాధ్యాక్షులు తోట వెంకటేష్ గుప్తా, గార్లపాటి వెంకటేష్ గుప్తా, పోకల కృష్ణ గుప్తా, సహాకార్యదర్శులు, బెలిదె బాలనర్సింహ్మా గుప్తా, చిన్ని నాగేందర్ గుప్తా, గౌటి లక్ష్మీనరసింహా, రంగ శేఖర్ గుప్తా, మర్యాల నర్సింహులు గుప్తా, పుసునాల శ్రీనివాస్ గుప్తా, సభ్యులు నంగునూరి సతీష్ గుప్తా, ఓరుగంటి నాగరాజు గుప్తా, గౌరిశెట్టి వీరేష్ గుప్తా, రంగ శశికాంత్ుప్తా, పులుగం హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు