జనసంద్రంగా యాదగిరి కొండ
కొండపైన భక్తులతో రద్దీగా పురవీధులు
స్వామివారి నిత్య రాబడి 32,32,366/-
యాదగిరిగుట్ట, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వరుస సెలవులతో పాటు ఆదివారాలు సెలవు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో వేకువ జామున సుప్రభాతం, అభిషేకము అర్చన, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణము, సాయంత్రం వెండి జోడి సేవను భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ దృశ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిత్య రాబడి 32,32,366/- వచ్చినట్లు ఆలయాధికారి తెలిపారు.