6న కృష్ణాష్టమికి తరలిరావాలి
05-09-2026 | 04:52pm
తాంసి/భీంపూర్,సెప్టెంబర్ 5(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్ర యాదవసంఘ భవనం(Yadava Sangha Building)లో ఈ నేల 6న నిర్వహించే శ్రీకృష్ణాష్టమి( Krishnashtami ) వేడుకలకు అందరూ హాజరై మహా ప్రసాదం స్వీకరించాలని జిల్లా యాదవసంఘ ప్రతినిధులు అసుర హన్మాండ్లు యాదవ్, సుధాకర్ యాదవ్ లుకోరారు. వారు శనివారం భీంపూర్, తాంసి, తలమడుగు మండలాల్లోని గ్రామాలు సందర్శించి కరపత్రాలు పంపిణీ చేశారు. కులాలకతీతంగా అందరూ రావాలని కోరారు. వారితో సంఘ సభ్యులు మంచాల మల్లయ్య, జి.శివ్వన్న,మహేందర్ యాదవ్,దేవారెడ్డి, జి. నరేందర్,కాల్చప్ యాదవ్ ,సతీష్ తదితరులు ఉన్నారు..






