చాటింగ్‌తో కోట్లు కొల్లగొట్టాడు!
ప్రేమ వలలో లాయర్.. కోట్ల నష్టం!
హైదరాబాద్: యువ న్యాయవాది సైబర్ నేరగాడి వలలో చిక్కాడు. సైబర్ నేరగాడు డేటింగ్ యాప్(Dating app)లో అమ్మాయిగా పరిచయం చేసుకుని లాయర్ కు వల వేశాడు. నిందితుడు సాప్ట్ వేర్ ఉద్యోగినంటూ నెలల తరబడి చాటింగ్(Chatting) చేసి నమ్మకం పెంచుకున్నాడు. తండ్రి చనిపోయాడంటూ ముందు రూ. 4.38 లక్షలు వసూలు చేశాడు. తర్వాత ట్రాన్స్‌జెండర్(Transgender) నంటూ అసలు విషయం బయటపెట్టి బ్లాక్ మెయిల్ చేశాడు.
చాటింగ్స్ బయటపెడతానని, గ్రూపు సభ్యులతో ఇంటికి వస్తానని బెదిరించాడు. తల్లి అనారోగ్యం పేరుతో మళ్లీ భయపెట్టడంతో బాధితుడు ఫ్లాట్ అమ్మడంతో పాటు కుటుంబ ఖాతాల్లోంచి భారీగా డబ్బులు ముట్టజెప్పాడు.. సైబర్ నేరగాడు మొత్తం 241 విడతల్లో ఏకంగా రూ. 4.91 కోట్లు వసూలు చేశాడు. బాధితుడు డబ్బును నిడదవోలు వ్యక్తి ఖాతాల్లోకి బదిలీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.