యువజన కాంగ్రెస్‌లో భారీ చేరికలు

04-10-2026 | 07:03pm

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి

ఎల్బీనగర్, అక్టోబర్ 4 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో(LB Nagar Constituency) నూతనంగా ఏర్పడిన జీఎస్ఐ డివిజన్‌లో(GSI Division) పలువురు యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబోయిన వినోద్ యాదవ్(Congress party leader Pochaboyina Vinod Yadav) ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి యువజన కాంగ్రెస్ లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డి  మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుందన్నారు.

యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన అనేక మంది నాయకులు నేడు వివిధ స్థాయిల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. నూతనంగా యువజన కాంగ్రెస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువజన కాంగ్రెస్ శ్రేణులు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, అర్హులైన పట్టభద్రుల ఓటర్లను పెద్ద సంఖ్యలో నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.

అనంతరం జీఎస్ఐ డివిజన్ యువజన అధ్యక్షుడిగా చిర్రబోయిన జై కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శులుగా రాకేశ్, కళ్యాణ్, రోహిత్ సెక్రెటరీలుగా ఫిరోజ్, శివసాయి, జాయింట్ సెక్రెటరీలుగా రితీష్, సోషల్ మీడియా ఇన్ చార్జిగా భవానీ శంకర్ ను నియమించి నియామక పత్రాలు అందజేశారు. లింగోజిగూడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గణేశ్ గౌడ్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్ చార్జి యరమల రామచంద్రారెడ్డి, నాయకులు లోకేశ్, శివ కుమార్, మిద్దెల భగత్, సామలేటి సాయి, సంజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు