యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య
17-09-2026 | 06:42pm
నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా(RR Crossroads)లో హరిబాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. హరిబాబు యూట్యూబర్ వైష్ణవి(YouTuber Vaishnavi) భర్తగా పోలీసులు గుర్తించారు. మార్చి 17, 2026న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో వైష్ణవి హత్యకు గురైన ఘటనలో ఆమె భర్త హరిబాబును నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షలతోనే హరిబాబు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.