బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికాన పూర్తి చేసి ఖరీఫ్ పంటకు సాగునీరు అందించాలి
29-06-2025
బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికాన పూర్తి చేసి ఈ ఖరీఫ్ పంటకు సాగునీరు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్(CPI State Executive Member Bommagani Prabhakar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ వలిగొండ మండల 14వ మహాసభ నర్సాపురం గ్రామంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఎలగందుల అంజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు.