సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి
20-01-2025
గద్వాల, జనవరి 19 ( విజయక్రాంతి): ఆన్?లైన్ సైబర్ మోసాల పట్ల యువత, ప్రజలు అప్రమత్తం ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లా తో పాటు వివిధ ప్రాంతాలలో పలు ఆన్లైన్ యాప్లో పెట్టు బడి పెడితే రోజు వారిగా అత్యధిక డబ్బు వ స్తుందనే ప్రచారంతో చాలామంది చదువు కున్న యువత, ఉద్యోగులు, సామాన్యులు లక్షలాది రూపాయలు పెట్టి మోసపోతున్నా రని, ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ వంటి చెడు ప్రభావాలకు అలవాట్లను విడిచి మంచి నడవడికలతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చాడు.