నిస్వార్థ సేవకు నిదర్శనం ఎన్ఆర్ఆర్
28-12-2025
మహబూబాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): నిస్వార్ధ సేవకు నిలువెత్తు నిదర్శ నంగా దివంగత మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు నూకల రామచంద్రారెడ్డి (ఎన్ఆర్ఆర్) నిలుస్తారని, ప్రస్తుత రాజకీయ నేతలు ఆయన్ని స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని శనివారం మంత్రి పొంగులేటి ఆవిష్కరించి, మాట్లాడారు. నూకల రామచంద్రారెడ్డి దివంగతులై 50 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆయన పేరును స్మరిస్తున్నారంటే ఆయన అప్పట్లో చేసిన ప్రజాసేవ ఎంతో అమోఘమైనదిగా పేర్కొన్నారు.