ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు
13-06-2025
వాజేడు జూన్ 12,(విజయ క్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలు గురువారం ప్రారంభమైనాయి. వాజేడు మండల పరిధిలో ప్రాథమిక పాఠశాలలో 30, ప్రాథమికోన్నత పాఠశాలలో 8, హై స్కూల్ 2, ఆశ్రమ పాఠశాలలు 2, గిరిజన ప్రాథమిక పాఠశాలలు 11, కస్తూర్బా గాంధీ పాఠశాల 1, మినీ గురుకులం 1 చొప్పున మొత్తం మండలంలో 55 విద్యాలయాలు ఉన్నాయి.