కిక్ బాక్సింగ్ లో విద్యార్థిని ప్రతిభ
02-12-2025
అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి హై స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న నమ్రత ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన అస్మిత ఖేల్ ఇండియా కిక్ బాక్సింగ్ లీగ్ లో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మహేశ్వరరావు తెలిపారు. కిక్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని ప్రిన్సిపాల్ మహేశ్వరరావు, కరస్పాండెంట్ ప్రసాద్, పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు రాజ్ కుమార్, దాసరి సురేష్, రాజ్ కుమార్, అజయ్ క్రాంతి కుమార్, పిఈటి గోగర్ల సాయి, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.