Districts

article_72140684.webp
మరోసారి తెరపైకి ఫార్మాసిటీ

02-05-2024

తాము అధికారంలోకి వస్తే ముచ్చర్ల ఫార్మాసిటీ రద్దు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీల వర్షం కురిపించారు. దీంతో ఎన్నికల్లో ఫార్మా బాధిత రైతులు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫార్మా రద్దుకు నిర్ణయం తీసుకొంటామని అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని కిసాన్ జాతీయ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రెస్‌మీట్‌లో చెప్పా రు. రైతుల క్షేమం కోసం ఫార్మాసిటీ వేరే ప్రాంతానికి తరలిస్తామని స్పష్టం చేశారు. కానీ, వారం రోజుల తర్వాత తమ హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఫార్మా సిటీని రద్దు చేయబోమని, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా విలేజ్‌లను నిర్మించి అందరికీ న్యాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ భూము లు తమకు వస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. కాగా, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఫార్మా అంశం చర్చానీయాంశమైంది.