కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
11-12-2025
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని బైరంపల్లి, సిద్ధాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కల్లెబోయిన కుమారస్వామి, మంద రాజు, వార్డు మెంబర్ల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజును గ్రామాలలోని మహిళామణులు సాంప్రదాయ కోలాటలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.