అయ్యప్ప ఆలయంలో ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠ
26-11-2025
దేవరకొండ: కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రమౌళీశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠా కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితులు పాలకుర్తి దేవి ప్రసాద్ శర్మ, కిరణ్ కుమార్ శర్మల నేతృత్వంలో హోమం, విశేష పూజలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయ అధ్యక్షుడు నాయిని మాధవరెడ్డి, నీల లక్ష్మయ్య, బుచ్చిరెడ్డి, చందా ధనుంజయ, నీల విజయ్, అయ్యప్ప గురుస్వామి చిట్టెడి ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.