ఏటీఎంగా తెలంగాణ
30-06-2025
నిజామాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రతీ సంక్షేమ పథకంలోనూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదని, బీఆర్ ఎస్ కంటే భారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని హెచ్చరించారు.