ప్రశాంతంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు
14-12-2025
కరీంనగర్,(విజయక్రాంతి): రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 05 మండలాల్లోని మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మరియు చిగురుమామిడి లోని పలు పోలింగ్ కేంద్రాలను సీపీ సందర్శించారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్, బందోబస్తు తీరును పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సీపీ సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. రెండవదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉందని సీపీ ఈ సందర్బంగా తెలిపారు.